కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

మంత్రి కేటీఆర్ విశ్వ బ్రాహ్మణులపై చేసిన వ్యాఖలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో విశ్వ బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. కేటీఆర్.. చారి, పప్పు చారి, తల్లోజు ఆచారి, అనే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. ఈ మేరకు మీర్ పేట్ బీజేపీ కార్పొరేటర్ బిక్షపతి చారి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేసీఆర్, కేటీఆర్ విశ్వబ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో చారి అనే వ్యక్తి ఆత్మబలిదానం చేసుకోకుంటే మీరు మంత్రి పదవులు అనుభవించేవారా అన్ని కార్పొరేటర్ బిక్షపతి చారి ప్రశ్నించారు. శ్రీకాంత్ ఆచారి అమరుడైనాడు కాబట్టే ఈ రోజు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చారి అనే వారు లేకపోతే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ ఖబర్దార్.. తక్షణమే చారిలకు క్షమాపణ చెప్పాలి అని కార్పొరేటర్ బిక్షపతి చారి, విశ్వ బ్రాహ్మణులు డిమాండ్ చేశారు.