
పంజాగుట్ట, వెలుగు: పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తే విధుల్లో మరింత క్రమశిక్షణతో పని చేస్తారని జస్టిస్ శ్రీసుధ పేర్కొన్నారు. ‘ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ’ ఆధ్వర్యంలో ఆదివారం గ్రీన్లాండ్స్లోని హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన ప్రోగ్రామ్ లో వివిధ రంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, విద్యావేత్తలు, వైద్యరంగ నిపుణులకు ఉగాది పురస్కారాలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతం, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్, పారిశ్రామిక వేత్త ఆర్క్గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.