
గామి చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన .. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. శుక్రవారం విశ్వక్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఆయా చిత్రాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చా రు మేకర్స్. వాటిలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టీమ్ కొత్త పోస్టర్‌తో బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూ డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామ్ తాళ్లూరి నిర్మి స్తున్న ఈ చిత్రానికి ‘మెకానిక్ రాకీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.
టైటిల్‌కు తగ్గట్టే చేతిలో మెకానిక్ రేంచ్‌తో పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించాడు విశ్వక్. తన కెరీర్‌లో ఇది 10వ చిత్రం. ఇదొక కామెడీ,యాక్షన్ ఎంటర్‌టైనర్. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తు న్నాడు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక విశ్వక్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం టైటిల్‌ను రివీల్ చేశారు. ‘లైలా’ అనే పేరును ఖరారు చేశారు. ఆమె ప్రపంచం అంటూ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.