విశ్వక్ సేన్ .. మెకానిక్ రాకీ డబ్బింగ్ స్టార్ట్

విశ్వక్ సేన్ .. మెకానిక్ రాకీ డబ్బింగ్ స్టార్ట్

విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న  చిత్రం ‘మెకానిక్ రాకీ’. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. తాజాగా ఈ మూవీ డబ్బింగ్ పనులను ప్రారంభించారు.  ఈ సందర్భంగా విశ్వక్ సేన్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేశారు మేకర్స్. 

 ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌కి ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఇదొక ట్రై యాంగిల్ లవ్‌‌స్టోరీ. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.  దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది.