అన్నపూర్ణ ఫొటో స్టూడియో.. చిన్న సినిమా అనొద్దు : విశ్వక్ సేన్

అన్నపూర్ణ ఫొటో స్టూడియో..  చిన్న సినిమా అనొద్దు  :  విశ్వక్ సేన్

చైతన్య రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అతిథిగా హాజరైన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్ చాలా బాగా నచ్చింది.  ఏ సినిమాను చిన్న సినిమా అనొద్దు. కొత్త వాళ్ల  సినిమా అని పిలవండి.  

మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నాడు. నిర్మాత రాజ్ కందుకూరి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. రెండు గంటలు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందన్నారు చైతన్య, లావణ్య. తమకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు దర్శక నిర్మాతలు. నటులు వైవా రాఘవ, ఉత్తర, లలిత్ ఆదిత్య, రఘు కుంచె, సినిమాటోగ్రాఫర్ పంకజ్, రైటర్ లక్ష్మీ భూపాల పాల్గొన్నారు.