
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారమే భక్తులను అనుమతివ్వనున్నట్టు తెలిపారు. ఇప్పటికే భౌతిక దూరం పాటించేలా గడులను ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు శానిటైజర్లతో శుభ్రం చేసుకున్న తర్వాతనే లోపలకు అనుమతిస్తామన్నారు. సాధారణ రోజుల్లో జరిగే అన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వ్రతాల నిర్వహణ, తలనీలాల సమర్పణ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. దర్శనాల విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ముందుగా ట్రయల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు దర్శనాలకు రాకపోవడమే మంచిదన్నారు ఆలయ ఈవో.