
ములుగు, వెలుగు: ములుగు మండలంలోని కొండపోచమ్మ జలాశయం, ఆర్అండ్ఆర్ కాలనీని ఉజ్బెకిస్తాన్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం సందర్శించారు. తహసీల్దార్ ఆరిఫా ఆ బృందానికి ప్రాజెక్టు నిర్మాణం, ముంపు గ్రామాల వివరాలు, వారికి అందజేసిన పరిహారం తదితర విషయాలను వివరించారు.
జీవనోపాధి కోల్పోయిన ప్రజలకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తెలిపారు. ఈ బృంద అధికారులు ఆయా దేశాల్లో పర్యటించి ప్రాజెక్టులు, చట్టాలు చేయడం ఎలా అనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.