
ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. తాను టీఆర్ఎస్ లో చేరితే 2019 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తానని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని.. అయితే ప్రస్తుతం జరిగింది వేరని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు పదవికి మాత్రమే రాజీనామ చేస్తున్నానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తన తండ్రి వెంకటస్వామి (కాకా) 60 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించారని.. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని అన్నారు. పెద్దపల్లి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు.