తాడిచర్ల మైన్స్​ను  ప్రైవేటుకు అప్పగించిన పాపం కేసీఆర్​దే : వివేక్​

తాడిచర్ల మైన్స్​ను  ప్రైవేటుకు అప్పగించిన పాపం కేసీఆర్​దే : వివేక్​

తాడిచర్ల మైన్స్ అనేది దాదాపు రూ.20వేల కోట్ల భారీ కుంభకోణమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. తాడిచర్ల మైన్స్​ ను ఏఎంఆర్​ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించిన పాపం కేసీఆర్​దేనని పేర్కొన్నారు. తాడిచర్ల మైన్స్​ ను ప్రైవేటు కంపెనీ ఏఎంఆర్​ కు అప్పగిస్తూ జరిగిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివేక్​ వెంకటస్వామి మాట్లాడారు.

“కోల్​ ఇండియా ప్రకారం ఒక టన్ను బొగ్గు సగటు ధర రూ.560 మాత్రమే. అయితే ఇక్కడ సింగరేణి నుంచి జెన్​ కో కు ఒక్కో టన్ను బొగ్గును దాదాపు రూ.3500కు ఏఎంఆర్​ కంపెనీ అమ్ముతూ భారీ లాభాలు గడిస్తోంది. పరిమితికి మించిన రేట్లతో జెన్​ కోకు బొగ్గు విక్రయం సరికాదు”అని ఆయన తెలిపారు.

లాభం అనేది సింగరేణికి అందాలే కానీ.. ఏఎంఆర్​ కంపెనీకి ఎలా ఇస్తరని వివేక్​ ప్రశ్నించారు. అది ఎవరి కంపెనీ ?అందులో కల్వకుంట్ల కుటుంబం వాటా ఉందా ? లేదా ? అనే దానిపై విచారణ జరగాలన్నారు. ‘‘ సింగరేణి సంస్థ నుంచి ఏఎంఆర్​ కంపెనీ వాళ్లు తప్పుడు రిపోర్టులు రాయించుకుంటున్నరు.  బొగ్గు హై గ్రేడ్​ ది అని చెప్పి ఏఎంఆర్​ కంపెనీకి ఎక్కువ రేటును ప్రభుత్వం చెల్లిస్తోంది” అని వివరించారు. తాడిచర్ల మైన్స్​ ప్రైవేటీకరణ వ్యవహారం, బొగ్గు విక్రయాల్లో అక్రమాలపై విచారణ జరగాల్సిన అసవరముందని ఆయన డిమాండ్​ చేశారు.