మాలల ఐక్యత కోసం నాగర్ కర్నూల్ సభ విజయవంతం అయిందనే స్పూర్తితో అన్నీ సభలు జరుగుతున్నాయని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మాలల ఐక్యత కోసం జరుగుతున్న అన్నీ మీటింగులకు గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరవుతుంటే.. కొందరు ఆయన మాలల లీడర్ అవుతా అని అడిగారంట. కరీంనగర్ లో ఆదివారం జరిగిన మాలల ఉపకులాల ఐక్య వేదికలో ఆయన ఆ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సంవత్సరం నుంచి మాలలపై అనేక విమర్శలు వస్తున్నాయని.. జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెన్నూర్ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన తండ్రి వెంకటస్వామి 75 వేల గుడిసెలు కట్టించినప్పుడు మాల, మాదిగ అని చూడలేదని అన్నారు.
ఆయన బిజెపిలో ఉన్నప్పుడు కూడా 23 శాతమే మాలలు ఉన్నారని కొందరు వాదిస్తే.. దాన్ని ఆయన ఖండించారని చెప్పారు. ఏ ఆధారం లేకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పానని అన్నారు. మాల మాదిగల సంఖ్య తేలిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని భయపడకుండా చెప్పానన్నారు గడ్డం వివేక్ వెంకటస్వామి. మన జాతిపైన జరుగుతున్న ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్లో జరిగే సభకు భారీ సంఖ్యలో మాలలు తరలివచ్చి ఐక్యత చాటాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నామని రాజకీయ పార్టీలకు చెప్పగలగాలని ఎమ్మెల్యే వివరించారు. కేవలం ఐదు లక్షలతో విశాక ఇండస్ట్రీస్ స్థాపించి.. ఈ స్థాయికి వచ్చానని అన్నారు.
Also Read :- రేషన్ కార్డు ఉన్నవారికి త్వరలోనే సన్న బియ్యం
కేవలం ఆస్తులు సంపాదించుకునేందుకు తాను అన్ని పార్టీలతో బాగుంటానని కొందరు విమర్శిస్తుంటారని.. కానీ, వివేక్ వెంకటస్వామి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ది పొందలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడకూడదని మా నాన్న చెప్పేవారని ఆయన అన్నారు. నాపై ఈడి రైట్స్ జరిగినప్పుడు కూడా భయపడలేదని గడ్డం వివేక్ చెప్పారు. గడ్డం వివేక్ వెంకట స్వామిపై విమర్శ చేస్తున్నారంటే.. వాళ్లు ఆయనకు భయపడుతున్నారని అర్థమవుతుందని చెప్పారు.