మర్రి చేరికతో పార్టీకి మరింత బలం: వివేక్ వెంకటస్వామి

మర్రి చేరికతో పార్టీకి మరింత బలం: వివేక్ వెంకటస్వామి

ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు సీఎం కేసీఆర్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. మర్రి శశిధర్ రాజకీయంగా అనుభవజ్ఞుడని తెలిపారు. వాళ్ల నాన్న మర్రి చెన్నారెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజలు నీరు లేక కరువుతో కొట్టుమిట్టాడుతుంటే.. వాళ్ల ఇబ్బందులు చూసి తట్టుకోలేక మర్రి చెన్నారెడ్డి  పోరాడారని తెలిపారు. మర్రి బీజేపీలో చేరడం వల్ల పార్టీకి మరింత బలం చేకూరిందని వివేక్ వెంకటస్వామి అన్నారు.

ఇక అంతకు ముందు కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ మర్రి శశిధర్ రెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్ ధర్మపురి, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశర్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు.