ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి: వివేక్ వెంకటస్వామి

ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి: వివేక్ వెంకటస్వామి

గతంతో నా ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ను అరెస్ట చేయాలని డిమాండ్ చేశారు.   ఫోన్ ట్యాపింగ్   కేసీఆర్, కేటీఆర్ సూచనలతో జరిగిందని ఆరోపించారు.  పదేళ్లు కేసీఆర్ దిగజారి పరిపాలన చేశారని తెలిపారు. కేసీఆర్ ఫ్యామిలీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీతో ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు


కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు వివేక్ వెంకటస్వామి.  ఇప్పటికే ఫ్రీ బస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేశామన్నారు. మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం  ఎన్నికల తర్వాత అందిస్తామన్నారు.  కాంగ్రెస్  12, 13 ఎంపీ  సీట్లలో గెలుస్తుందన్నారు.   రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు మంచి స్పందన వస్తుందన్నారు. పెద్దపల్లి సెగ్మెంట్ కు కాకా ఎంతో సేవ చేశారని తెలిపారు. తాము అధికారంలో లేకున్నా ప్రజల కోసం పనిచేశామని చెప్పారు.   రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్ కోసం కృషి చేశామని చెప్పారు.  సింగరేణిలో కొత్త గనులు వచ్చే అవకాశం ఉందన్నారు వివేక్.