అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం

అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకటస్వామి ఆర్థిక సాయం

నిర్మల్ జిల్లా బైంసాలో అంబేద్కర్ విగ్రహ పున:ప్రతిష్ఠాపణకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించారు  బిజెపి కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి. బైంసా అంబేద్కర్ సంఘం నేతలతో పాటు బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కొంత మంది దుండగుల చేతిలో బైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కాగా.. కొత్త విగ్రహం ఏర్పాటుకు వివేక్ స్వచ్ఛంద సంస్థ విరాళాన్ని అందించారు. ఇటీవల నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో పర్యటించిన వివేక్.. అంబేద్కర్ విగ్రహ పున:ప్రతిష్టకు తనవంతు సహాయం అందిస్తానని హామీఇచ్చారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి అంబేద్కర్ సంఘం, బీజేపీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.