రోశయ్య మృతి పట్ల వివేక్ వెంకటస్వామి సంతాపం

V6 Velugu Posted on Dec 04, 2021

మాజీ సీఎం రోశయ్య ఉమ్మడి ఏపీకి అత్యధికసార్లు ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. తమిళనాడు, కర్నాటకలకు గవర్నర్ గా కూడా పనిచేసిన రోశయ్య... గొప్ప మంత్రి అని ఆయన అన్నారు. తన తండ్రి వెంకటస్వామితో కూడా కలిసి రోశయ్య పనిచేశారని వివేక్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎంగా ఉన్న రోశయ్య.. తనను చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావని.. అయినా సరే కొట్లాడు అని చెప్పేవారని వివేక్ అన్నారు. రోశయ్య మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు వివేక్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

Tagged Bjp, Hyderabad, Congress, BJP leader Vivek Venkatswamy, former CM Roshaiah

Latest Videos

Subscribe Now

More News