ఎంబీబీఎస్ స్టూడెంట్కు వివేక్ వెంకటస్వామి నివాళి

ఎంబీబీఎస్ స్టూడెంట్కు వివేక్ వెంకటస్వామి నివాళి

పెద్దపల్లి జిల్లా: అనారోగ్యంతో చనిపోయిన ఎంబీబీఎస్ స్టూడెంట్ నాగపూజితకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ చదువుతున్న నాగపూజిత మార్చి 7న అనారోగ్యంతో చనిపోయింది. నాగపూజిత డెడ్ బాడీని సొంతూరుకు తీసుకురావాలని ఆమె పేరెంట్స్ వివేక్ వెంకటస్వామిని విన్నవించుకోగా ఆయన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇండియాకు తీసుకురావడానికి కృషి చేశారు. వీరి కృషితో నాగపూజిత మృతదేహం స్వగ్రామం పెద్దపల్లి జిల్లా 8ఇంక్లెయిన్ కాలనీకి చేరుకుంది. నిన్నరాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు డెడ్ బాడీ రాగా... ఇవాళ ఉదయం నాగపూజిత పేరెంట్స్ కు అప్పగించారు. 
నాగపూజిత డెడ్ బాడీని తీసుకురావడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వివేక్ లకు ఎంతో రుణపడి వుంటామని కృతజ్ఞతలు తెలిపారు తల్లిదండ్రులు, బంధువులు. వివేక్ వెంకట స్వామి సాయంతోనే తమ బిడ్డను కడసారి చూడగలిగామన్నారు నాగపూజిత పేరెంట్స్. తమ కూతురు చనిపోయిందన్న విషయం తెలియగానే వివేక్ తమ దగ్గరికి వచ్చి ఓదార్చారని చెప్పారు. డెడ్ బాడీని ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్రంతో మాట్లాడి హెల్ప్ చేశారన్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్

ఫ్యాట్​ ఈజ్​ క్యూట్​ అంటూ ర్యాంప్​ వ్యాక్

జైల్లో చదివిండు ఐఐటీ ర్యాంకర్​​ అయ్యిండు