కాకా వెంకటస్వామి ఆశయాలను అంబేద్కర్ విద్యాసంస్థలు నెరవేరుస్తున్నాయి: వివేక్ వెంకటస్వామి

కాకా వెంకటస్వామి ఆశయాలను అంబేద్కర్ విద్యాసంస్థలు నెరవేరుస్తున్నాయి: వివేక్ వెంకటస్వామి

పేద విద్యార్థుల కోసం కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థలు క్వాలిటీ విద్యను అందించడంతో పాటు విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహిస్తున్నాయని కాలేజీ ఛైర్మన్​ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఏ ఆశయం కోసమైతే కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యాసంస్థలను స్థాపించారో.. ఆ ఆశయాలను కాలేజీ అందుకుందన్నారు. కాకా కలలను ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ విద్యాసంస్థలు 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయని చెప్పారు. పలు క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను వివేక్ వెంకటస్వామి, కరస్పాండెంట్ సరోజ అభినందించారు.

పేద విద్యార్థులకు మంచి విద్యనందిస్తాం..

కాకా వెంకటస్వామి కోరుకున్న విధంగా పేద విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అంబేద్కర్ విద్యాసంస్థలు ఉచితంగా, క్వాలిటీ విద్యను అందిస్తున్నాయని కరస్ఫాండెంట్ సరోజ వివేక్ అన్నారు. అన్ని విభాగాల్లో  రాణిస్తూ.. విద్యార్థులు అంబేద్కర్ కాలేజీకి ఎంతో పేరు తెచ్చారని కొనియాడారు. 10వ తరగతి ఫలితాల్లో అంబేద్కర్ కాలేజీ వాచ్ మెన్ కూతుర్ టాపర్ గా నిలిచిందన్నారు.  ఇంటర్లో  స్టేట్ 4వ ర్యాంక్ ,  LLM  ఎంట్రన్స్లో స్టేట్ టాపర్తో పాటు స్ఫోర్ట్స్  కరాటే విభాగంలో డిగ్రీ విద్యార్థికి గోల్డ్ మెడల్, LLB లెక్చరర్  అర్చరీలో స్వర్ణం సాధించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు.  అంబేద్కర్ విద్యాసంస్థలు..ఎప్పటికీ పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.