అంబేద్కర్ కాలేజ్ గొప్ప లాయర్లను అందించింది : వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్ కాలేజ్ గొప్ప లాయర్లను అందించింది : వివేక్ వెంకటస్వామి
  • పేద విద్యార్థులకు చదువును పంచాలనే కాకా విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన్రు
  • విద్యార్థులకు డిసిప్లిన్ చాలా అవసరమని సూచన
  • అంబేద్కర్ కాలేజీలో లా స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌‌

ముషీరాబాద్, వెలుగు:  సమాజానికి గొప్ప లాయర్లు, విద్యావంతులను అంబేద్కర్ లా కాలేజ్ అందించిందని చెన్నూరు ఎమ్మెల్యే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌‌‌‌‌‌స్టిట్యూషన్స్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. పేద విద్యార్థులకు చదువును పంచాలనే బలమైన ఆకాంక్షతో విద్యాసంస్థలను కాకా వెంకటస్వామి ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఇందులో చదువుకున్న వారు ప్రపంచవ్యాప్తంగా ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. విద్యార్థులకు డిసిప్లిన్ చాలా అవసరమని, రోజూ రీడింగ్  అలవాటు చేసుకోవాలని సూచించారు. అన్నింట్లో చురుగ్గా ఉంటే విజయం సాధిస్తారని చెప్పారు. 

శనివారం హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజీలో లా స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌‌‌‌ జరిగింది. ఈ కార్యకమానికి ముఖ్య అతిథులుగా ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, సెక్రటరీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ విజయలక్ష్మి, అంబేద్కర్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సరోజా వివేక్, హ్యూమన్ రైట్స్ కమిషనర్ విద్యాధర బట్టు, హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. 

లా అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమని ప్రొఫెసర్ విజయలక్ష్మి అన్నారు. నిరంతరం కృషి చేస్తేనే గొప్ప లాయర్ గా ఎదుగుతారని చెప్పారు. అంబేద్కర్ కాలేజీలో గొప్ప ఫ్యాకల్టీ ఉందని, స్టూడెంట్స్ చక్కగా చదువుకొని ర్యాంకులు సాధించి కళాశాలకు, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఇన్‌‌‌‌స్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజ వివేక్ ఆకాంక్షించారు. 

స్టూడెంట్స్‌‌‌‌కు అటెండెన్స్ ముఖ్యమని, 80% అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్‌‌‌‌కు మేనేజ్‌‌‌‌మెంట్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. లా పూర్తి చేసిన వారు సొసైటీకి ఎంతో అవసరమని హ్యూమన్ రైట్స్ కమిషనర్ విద్యాధర బట్టు అన్నారు. లా చదువుతున్న విద్యార్థులు హైకోర్టు ప్రొసీడింగ్స్, వాదనలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ అన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రమణ కుమార్ తోపాటు ఇన్‌‌‌‌స్టిట్యూషన్స్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్, న్యాయ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.