కుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా ఇచ్చారా : వివేక్ వెంకటస్వామి

కుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా ఇచ్చారా : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా కుందారంలో బాల్క సుమన్ ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి  వివేక్ వెంకటస్వామి. తాను ఎంపీగా ఉన్నప్పుడు కుందారం గ్రామానికి 380 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. బాల్కసుమన్ ఒక్కసారైనా గ్రామానికి రాలేదని విమర్శించారు. కుందారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివేక్ వెంకటస్వామి..   ఓటు వేసి గెలిపించుకున్న బాల్కసుమన్  ఎన్నడూ ప్రజలను కలవలేదన్నారు. బాల్కసుమన్ క్యాంపు ఆఫీసులో చెన్నూరు ప్రజలు గంటల తరబడి  ఎదురుచూడాల్సి వస్తోందన్నారు.

కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రభావంతో పంటలు మునిగి ప్రజలు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు వివేక్ వెంకటస్వామి.  గోదారి పరివాహక ప్రాంతంలో  కరకట్ట కట్టాలనే సోయి కూడా సుమన్ కు లేదన్నారు.   మైనింగ్ పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చెన్నూరు నుంచి రోజుకు 200 లారీ ఇసుకును బాల్క సుమన్ తరలిస్తున్నారని ఆరోపించారు. చెన్నూరులో ప్రభుత్వ దవాఖాన కట్టిండు కానీ వైద్యులు లేరన్నారు.  చెన్నూరు ఓట్ల కోసం ప్రభుత్వ దవాఖానాను ఆగమేఘాల మీద హరీష్ రావుతో ఓపెన్ చేయించారన్నారు.  బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపనిలో 30 శాతం కమీషన్ తీసుకునుడు అలవాటన్నారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ పంపిణీ చేసే 5 వేల రూపాయల్లో కూడా 30 శాతం కమీషన్ తీసుకుటారని ధ్వజమెత్తారు వివేక్ వెంకటస్వామి.

చెన్నూరులో బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్  పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి జి.వెంకటస్వామి..బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలోకి దిగుతున్నారు.