మీడియాలో విశ్వసనీయతే ముఖ్యం..:వివేక్ వెంకటస్వామి

మీడియాలో విశ్వసనీయతే ముఖ్యం..:వివేక్ వెంకటస్వామి

వార్తల విశ్వసనీయతే మీడియాను నిలబెడుతుందని విశాఖ ఇండస్ట్రీస్ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు.  ఆగస్టు 1న మ్యారియేట్ హోటల్లో సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ సీజన్ 4 ప్రారంభం అయింది. లీడర్షిప్ ప్యానల్ డిస్కషన్ లో వివేక్ ప్రసంగించారు. 

ప్రపంచ దేశాల జీడీపీ పడిపోతుంటే ఇండియా జీడీపీ మాత్రం 6.8 శాతంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ సక్సెస్ అయిందని వివేక్ పేర్కొన్నారు. 

విశాఖ ఇండస్ట్రీస్ లో మంచి టీం ఉండటం వల్లే 40 ఏళ్లుగా గ్రో అవుతున్నామని చెప్పారు. వీ బోర్డ్స్ దేశంలోనే టాప్ ప్రొడక్ట్స్ గా ఉన్నాయని చెప్పారు. త్వరలో తమ కంపెనీ నుంచి వస్తున్న సోలార్ రూఫ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని అన్నారు.  వీ బోర్డ్స్ దేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్ట్స్ లో ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, అలనాటి హీరోయిన్ అక్కినేని అమల తదితరులు హాజరయ్యారు. 

ఇంటరాక్ట్ కాని రోజు లేదు..

తన పొలిటికల్ జర్నీలో మీడియాతో ఇంటరాక్ట్ కానీ రోజు లేదని.. వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా మీడియా ఉంటుందని తెలిపారు. మీడియా ప్రజల పక్షంగా  పోరాడాలన్నారు. సౌత్ పొలిటీషియన్స్, సౌత్ మీడియాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందని వివేక్ అన్నారు. తెలంగాణలో వీ6, వెలుగు నంబర్ 1 మీడియాగా నిలిచిందని  ఆయన గుర్తు చేశారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా టాప్ పొజీషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. 

యూపీలో గవర్నర్ కాన్ఫరెన్స్ లకు వెళ్లినప్పుడు అక్కడ తనను గుర్తు పట్టక రిసీవ్ చేసుకోలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం మీడియా అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని వార్తలు రాసేటప్పుడు జర్నలిస్టులు కేర్ ఫుల్ గా ఉండాలని సూచించారు. 

ఏఐ టెక్నాలజీ మీడియా రంగంలో పెను మార్పులు తీసుకువస్తోందని అన్నారు. సోషల్ మీడియా తదితర ప్రభావాలను తట్టుకుని నిలబడితేనే మీడియాకు ఉజ్వల చరిత్ర ఉంటుందని స్పష్టం చేశారు.

ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు..

కొన్ని మీడియాల్లో తాను త్వరలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయా సంస్థలు ఫేక్ న్యూస్ లు కాకుండా ప్రజలకు ఉపయోగ పడే వార్తలు ఇవ్వాలని సూచించారు. ప్రజలు నిజాలే నమ్ముతారని ఫేక్ న్యూస్ ని వ్యాపింపజేయాలనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. పబ్లిక్ హాట్ న్యూస్ కావాలనుకోవడం సహజమే అని అంత మాత్రాన అబద్ధాలను వండివార్చడం సరైంది కాదని చెప్పారు.