పెన్షన్లు టీఆర్ఎస్ నేతలు వాళ్ల ఇండ్లలోంచి ఇవ్వట్లేదు

పెన్షన్లు టీఆర్ఎస్ నేతలు వాళ్ల ఇండ్లలోంచి ఇవ్వట్లేదు

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై హరీష్ రావు విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ దందా నడుస్తుందని ఆయన మండిపడ్డారు. డీపీఆర్‌లు ఇవ్వకుండా ప్రాజెక్టు వ్యయాన్ని ఇష్టారీతిన పెంచుకుంటూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నానని ఆయన అన్నారు.  

‘36 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచి దోచుకున్నారు. ఆంధ్ర కాంట్రాక్టరైన మేఘా కృష్ణ రెడ్డికి ఫోర్బ్ జాబితాలో చోటు దక్కడానికి కారణం కేసీఆరే. రాష్ట్రం అవినీతిలో అగ్రభాగాన ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుంది. పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి టీఆర్ఎస్‌కే ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెబుతున్నారు. ప్రజలు కట్టిన పన్నులనే ప్రజలకు ఇస్తున్నారు తప్ప..  టీఆర్ఎస్ నేతల ఇండ్లలోంచి తెచ్చి ఇవ్వడం లేదు’ అని ఆయన అన్నారు.