ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజా సేవలో నిమగ్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.  నిన్న అడ్లూరి లక్ష్మణ్ ను వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.  

ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన విప్ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం తెల్లవారుజామున తిరిగివస్తుండగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం, కొత్తపేట మధ్య ఉన్న టర్నింగ్ వద్ద లారీని తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అడ్లూరి తలకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి.  వెంటనే ఆయన్ను  కరీంనగర్ అపోలో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించి, ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు.  అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.