క్యాతనపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : వివేక్ వెంకటస్వామి

క్యాతనపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : వివేక్ వెంకటస్వామి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: రామకృష్ణపూర్-మంచిర్యాల ప్రధాన రహదారిలోని క్యాతనపల్లి రైల్వే గేట్ వద్ద ప్రమాదంలో మృతి చెందిన మృతుల బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి మందమర్రి మున్సిపాలిటీలోని ఆర్కే1 మార్కెట్ వద్ద కాంగ్రెస్-సీపీఐ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బాధిత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కలిపిస్తామన్నారు. కొన్నేండ్లుగా పెండింగ్ లో ఉన్న క్యాథనపల్లి రైల్వే ఓవర్ బ్రడ్జి నిర్మాణం ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్లక్ష్యంతోనే ఆలస్యం అవుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ లో పలువురి చేరిక

వివేక్ వెంకటస్వామి సమక్షంలో పలువురు బిఅరెస్ లీడర్లు కాంగ్రెస్ లో చేరారు. సోమవారం చెన్నూరు నియోజకవర్గంలోని కత్తెరశాల, అంగ్రాజుపల్లి, పొక్కురు, ఎర్రగుంటపల్లి,కొమ్మెర, బీరెల్లితోపాటు జైపూర్ మండలం నర్వ, రసూల్ పల్లి, ముదిగుంట, మిట్టపల్లి మున్సిపాలిటీలోని ఆర్కే వన్ సుభాష్ నగర్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని మల్లికార్జున నగర్ లో బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. బీరెల్లి సర్పంచ్ సారయ్య, రచ్చ పెళ్లి ఉప సర్పంచ్ రాజయ్యతోపాటు మర్రి కుమారస్వామి పార్టీలో చేరగా వారికి వివేవ్​వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

వివేక్​కు మద్దతుగా ప్రచారం..

చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని జైపూర్ మండలంలోని షెట్​పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించారు. పార్టీ లీడర్లు తాళ్లపల్లి కిరణ్ గౌడ్, అన్నం వెంకన్న, శ్రావణ్ గౌడ్, తిరుపతి గౌడ్ పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.