
గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో ఇండియా మార్కెట్లోకి వివో వై19 పేరుతో 5జీ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 6.74- అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, వెనుక డ్యూయల్ కెమెరా సెటప్, ముందు 5 ఎంపీ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్, సైడ్- మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. వివో వై19 5జీ 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499 కాగా, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు.