నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ లీడ్‌గా, సపోర్టింగ్ రోల్స్ తో వరుస సినిమాలు చేస్తున్నారు వీకే నరేష్. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘క్రేజీ కల్యాణం’. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పంచె కట్టుకుని ట్రెడిషినల్ లుక్‌లో ఆకట్టుకున్నారు నరేష్.
ఇందులో ఆయన పర్వతాలు పాత్రలో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరిపారు. నరేష్‌తోపాటు అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తుండగా, యారో సినిమాస్ బ్యానర్‌పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు.
