హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఐటీ, జేఈఈ, నీట్ ప్రవేశపరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా విద్యామందిర్ క్లాసెస్(వీఎంసీ) శిక్షణ ఇవ్వనుంది. వచ్చే విద్యాసంవత్సరానికి ఐఐటీ, నీట్, జేఈఈలో ట్రైనింగ్ ఇచ్చేందుకు మాదాపూర్, సుచిత్రలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బేగంపేట గ్రీన్ పార్క్ హోటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ కార్యకపాలను డీఆర్డీవో మాజీ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలు కేవలం ఐఐటీయన్స్, డాక్టర్లను మాత్రమే కాకుండా దేశానికి అవసరమైన వృత్తి నిపుణులను తయారు చేయాలని పిలుపునిచ్చారు. వీఎంసీ సీఈవో కౌశిక్ మిశ్రా మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలో తొలిసారిగా మాదాపూర్, సుచిత్రలో వీఎంసీ ఐఐటీ జేఈఈ, నీట్ తో ఇంటర్ విద్యను అందించనున్నట్లు తెలిపారు. సింబయాసిస్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ రజనీకాంత్, జీవీకే రెడ్డి, వీఎంసీ ఉపాధ్యక్షుడు ప్రతీక్ భట్టాచార్య, దక్షిణాది హెడ్ గౌస్, ఏపీ, తెలంగాణ హెడ్ శైలజా, హైదరాబాద్ డైరెక్టర్లు గౌతమిరెడ్డి, కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.
