వోడాఫోన్​ ఐడియా ఏజీఆర్ బకాయిలు​ కట్టలే

వోడాఫోన్​ ఐడియా ఏజీఆర్ బకాయిలు​ కట్టలే

న్యూఢిల్లీ: వోడాఫోన్​ఐడియా లిమిటెడ్​ తాను చెల్లించాల్సిన ఏజీఆర్​ బకాయిలు రూ. 8,837 కోట్లను కట్టలేకపోతోంది. ఈ బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు  కంపెనీ వెల్లడించింది.ఈ అడ్జస్టెడ్​ గ్రాస్​ రెవెన్యూ (ఏజీఆర్​) బకాయిల చెల్లింపు కోసం టెలికం డిపార్ట్​మెంట్​ జూన్​ 15 న కోరిందని ఎక్స్చేంజ్​ ఫైలింగ్​లో వోడాఫోన్​ ఐడియా లిమిటెడ్​ తెలిపింది. 2016–17 తర్వాత రెండు ఫైనాన్షియల్​ ఇయర్స్​కు సంబంధించిన ఈ బకాయిల చెల్లింపు సుప్రీం కోర్టు తీర్పు పరిధిలోవి కావని పేర్కొంది. 2018–19 ఫైనాన్షియల్​ ఇయర్​ దాకా ఏజీఆర్​ సంబంధ బకాయిలన్నింటి చెల్లింపునకు తమకు టెలికం డిపార్ట్​మెంట్​ నాలుగేళ్ల మారటోరియం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ అవకాశాన్ని వాడుకోవడానికి జూన్​ నెలాఖరు లోపు (15 రోజుల గడువు)  సమ్మతి తెలియచేయాల్సిందిగా టెలికం డిపార్ట్​మెంట్​ తమను కోరినట్లు పేర్కొంది. ఈ ఏజీఆర్​ సంబంధ బకాయిలపై వడ్డీని కూడా ఈక్విటీగా మార్చుకునే వీలు ఉన్నట్లు వివరించింది. ఇందుకు 90 రోజుల దాకా గడువున్నట్లు డిపార్ట్​మెంట్​ఆ లెటర్లో తెలిపినట్లు వోడాఫోన్​ ఐడియా  పేర్కొంది. తాజా డిమాండ్ ​కూడా రివిజన్​ పరిధిలో ఉందని, అప్పుడు ఎంత తేలితే అంత కట్టాల్సి వస్తుందని తెలిపింది. రూ. 16 వేల కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చుకోవడానికి ఇప్పటికే వోడాఫోన్​ ఐడియా లిమిటెడ్​కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో కంపెనీ ఈక్విటీలో 33 శాతం వాటా ప్రభుత్వానికి లభిస్తుంది.​ 2018–19 ఫైనాన్షియల్​ ఇయర్​ దాకా టెలికం కంపెనీలు మొత్తం రూ. 1.65 లక్షల కోట్లను ఏజీఆర్​ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.