రూ.30 వేల కోట్ల బకాయిలు మాఫీ చేయండి.. సుప్రీంకోర్టులో వొడాఫోన్ ఐడియా పిటిషన్​

రూ.30 వేల కోట్ల బకాయిలు మాఫీ చేయండి.. సుప్రీంకోర్టులో వొడాఫోన్ ఐడియా పిటిషన్​

న్యూఢిల్లీ: తమ అడ్జెస్టెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) బకాయిల భారం నుంచి ఉపశమనం కోరుతూ వొడాఫోన్ ఐడియా(వీ) గురువారం సుప్రీం కోర్టులో కొత్త పిటిషన్ ఫైల్ చేసింది.  ఈ టెలికాం కంపెనీ రూ.30 వేల కోట్లకు పైగా వడ్డీ, పెనాల్టీ, పెనాల్టీపై వడ్డీలను మాఫీ చేయాలని అడిగింది.  ఈ కేసును త్వరగా విచారణకు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌ను కంపెనీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరారు. 

ఈ పిటిషన్ మే 19న విచారణకు రానుంది. రోహత్గీ మాట్లాడుతూ, టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ ఉండాలంటే వొడాఫోన్ ఐడియా బతకడం చాలా కీలకమని, కంపెనీ ఈ ఫైనాన్షియల్ భారాన్ని సొంతంగా భరించలేదని చెప్పారు. ఇటీవల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చడంతో సెంట్రల్ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కంపెనీలో 49 శాతం వాటా దక్కిందని కూడా ఆయన పేర్కొన్నారు.