యువతను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఫెయిల్​ : వొడితెల ప్రణవ్​

యువతను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఫెయిల్​ : వొడితెల ప్రణవ్​

జమ్మికుంట, వెలుగు: యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిలయ్యాయని హుజూరాబాద్​కాంగ్రెస్​అభ్యర్థి వొడితెల ప్రణవ్ ఆరోపించారు. గురువారం జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి, మడిపల్లి, అంకుసాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు కోలాటాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20 ఏండ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్ ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్​ పాలనతో ప్రజలు విసుకు చెందారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములను అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. ఈటల రాజేందర్ గజ్వేల్ లో పోటీ చేస్తూ అక్కడి బిడ్డనని, హుజూరాబాద్ లో ఇక్కడి బిడ్డను అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారంలో లీడర్లు అరకాల వీరేశలింగం, తుమ్మేటి సమ్మిరెడ్డి, సుంకరి రమేశ్, పూదరి రేణుకతో పాటు పాల్గొన్నారు.