భీకర బాంబు దాడి వేళ ఫొటోషూటా..?

భీకర బాంబు దాడి వేళ ఫొటోషూటా..?

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ చూపిన ధైర్యసాహసాలను ప్రపంచ దేశాలు సైతం కొనియాడిన విషయం తెలిసిందే. దేశ ప్రజలను కాపాడుకునేందుకు ఆయన చూపించిన తెగువ యావత్ ప్రపంచాన్ని ఆకర్షించాయి. అలాంటి నేత ఇప్పుడు విమర్శల పాలవుతున్నాడు. కారణం ఆయన తన భార్య ఒలెనా జెలెన్ స్కాతో చేసి ఫొటోషూటే. దేశంలో తీవ్ర సంక్షోభం వేళ ఆయనలా ఫొటోషూట్ లో పాల్గొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖ వోగ్ మ్యాగజైన్ పత్రిక ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఒలెనా పాల్గొన్నారు. అందులో భాగంగా భార్యాభర్తలిద్దరూ ఫొటోలకు ఫోజులిస్తూ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. అంతే కాదు ఉక్రెయిన్ లోని తాజా పరిస్థితులు ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో యుద్ద ట్యాంకులు, సైనికులతో కలిసి ఫొటో దిగారు. ఈ ఫొటోలను ఉక్రెయిన్ ప్రథమ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వోగ్ మ్యాగజైన్ పేజీపై ఫొటో రావడమనేది ఎంతో గౌరవంతో కూడినదన్న ఆమె.. దానికి యుద్ద కారణం కాకూడదని కోరుకున్నానని తెలిపింది. సైరన్ల మోతలో, శిబిరాల్లో దీనంగా బతికునీడుస్తున్న ప్రతి మహిళకు ఈ కవర పేజీపై ఉండే హక్కు ఉందని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు ట్రెండింగ్ గా మారాయి. దీంతో పాటు మరికొందరు ఈ ఫొటోషూట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.