నిన్నటి వరకు వాలంటీర్.. ఇప్పుడు సర్పంచ్

నిన్నటి వరకు వాలంటీర్.. ఇప్పుడు సర్పంచ్
  • మంచితనం గుర్తించి ఏకగ్రీవంగా పట్టం కట్టిన గ్రామస్తులు

కదిరి, అనంతపురం జిల్లా:  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఓ సామెత. చాలా మంది అంగీకరించే వాస్తవం కూడా. వాలంటీర్‌గా ఇంటింటికీ తిరిగి సేవలు అందించే ఉద్యోగం దక్కించుకున్న యువతి తన వృత్తి ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించడం కాలనీల ప్రజలే కాదు… గ్రామ పెద్దలు కూడా గుర్తించారు. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఈమెకు ఏకంగా సర్పంచ్ గిరీని కట్టపెట్టారు. అది కూడా ఏకగ్రీవంగా. ఈమె బరిలోకి దిగడంతో ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన వారు కూడా వెంటనే వెనక్కి తగ్గి తమవంతు ఆదరాభిమనాలు చాటుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామంలో జరిగిందీ అరుదైన ఘటన.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముత్యాల చెరువు పంచాయతీ సర్పంచ్ స్థానం రొటేషన్‌లో బీసీ మహిళకు రిజర్వ్ అయింది. మంచి అభ్యర్థుల కోసం ఆయా పార్టీల తరపున వేట మొదలైంది. అయితే వాలంటీర్ గా పనిచేస్తున్న ఎన్.శుభలేఖ పేరును కొద్ది మంది ప్రస్తావించారు. ఆమె మాటతీరు.. పనితీరు గ్రామంలో అందరికీ చిరపరిచితమే. దీంతో ఆమె సర్పంచ్ అయితే బాగుంటుందని అనేక మంది ఒత్తిడి చేయడంతో ఆమె తన వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ సర్పంచ్ గా నామినేషన్ వేసింది. శుభలేఖ తోపాటు మరో ముగ్గురు సర్పంచ్ స్థానానికి పోటీలో నిలిచారు. నిన్న గురువారం నామినేషన్ల ఉప సంహరణ జరుగుతున్న సమయంలో గ్రామ పెద్దలు, ప్రజలు అంతా కలసి చర్చించుకుని శుభలేఖను ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని నిర్ణయించారు. వెంటనే అధికారులను కలసి నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఈమె ఎన్నిక లాంఛనమే అయింది. అధికారికంగా ప్రకటించకుండా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులివ్వడంతో ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. గ్రామస్తులు, పెద్దలు అందరూ కలసి తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సర్పంచ్ శుభలేఖ సంతోషం వ్యక్తం చేయడమే కాదు.. తనదైన శైలిలో మర్యాదపూర్వకంగా గ్రామ పెద్దలను కలసి వారి ఆశీర్వాదం తీసుకుని శెభాష్ అనిపించుకుంది.

for more news..

అమ్మాయి పిలిచిందని వెళ్లి బుక్కయిపోయారు…

ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు

ఖతర్నాక్ డ్రోన్.. గాల్లోకి లేచిందంటే మూడ్నేళ్లు ఆకాశంలోనే

కారులో వచ్చి ఏటీఎం చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్