ఆంధ్రప్రదేశ్ లో వోల్వో బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న తెలంగాణ Rకి చెందిన వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అలర్టై… ప్రయాణికులను కిందకు దించేశాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర గురువారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.అధికారులు ప్రయాణికులను వేరే బస్సులో తరలించారు.
