వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్న యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహిళల ఓట్లు

వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్న యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహిళల ఓట్లు
  • నల్గొండ జిల్లాలో మొత్తం ఓట్లు 13.55 లక్షలు
  • 18 - 39 ఏళ్ల మధ్య ఉన్న వారు 6,77,857 మంది
  • దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యువ ఓటర్లు
  • సాగర్, మిర్యాలగూడ, నల్గొండలో ఎక్కువగా మహిళలు

నల్గొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో యువకులు, మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో  13.55 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 50 శాతం మంది యువకులే ఉన్నారు. ఆరు నియోజకవర్గాల్లో కొత్తగా నమోదైన ఓటర్లతో కలుపుకుని 18 నుంచి 39 ఏళ్ల మధ్య 6,77,857 మంది ఉన్నారు. 40 నుంచి 100 ఏళ్ల మధ్య ఉన్న వారు 6,77,694 మంది ఉన్నారు. వీళ్లలో వందేళ్ల వయసు ఉన్న ఓటర్లు 113 మంది ఉన్నారు. జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు కేవలం 17,583 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్నవారే 4,05,785 ఉన్నారు. సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 40 నుంచి 49 మధ్య 2,74,876 మంది ఉన్నారు. 

మూడింట్లో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మరో మూడింట్లో మహిళలు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జిల్లాలో 18 నుంచి 39 ఏళ్ల వయసున్న ఓటర్లలో దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గాలు టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. ఈ కేటగిరీలో దేవరకొండలో 1,16,487 మంది, మునుగోడులో 1,22,340 మంది, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,14,654 మంది ఉన్నారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,​ మిర్యాలగూడ, నల్గొండ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. పురుషులతో పోలిస్తే నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,333 మంది, మిర్యాలగూడలో 2,638 మంది, నల్గొండలో 3,989 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో పురుషులు మొత్తం 6,75,489 మంది ఉండగా, మహిళలు 6,79,945 మంది ఉన్నారు. 48 థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్లు ఉన్నాయి.

ఓటరు, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 83 శాతం పూర్తి

ఓటరు గుర్తింపు కార్డులకు, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 83 శాతం పూర్తైంది. దేవరకొండలో 1,57,278 మంది ఓటరు గుర్తింపుకార్డులను ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోగా, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,69,219 మంది, మిర్యాలగూడలో 1,80,196, నల్గొండలో 2,02,279, మునుగోడులో 2,03,928, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,10,135 మంది ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తైంది. ఇప్పటికైతే ఎలాంటి తీసివేతలు చేపట్టకుండా ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేస్తున్నారు. తర్వాత ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయం మేరకు డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోగస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తైతే జిల్లాలో ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.