హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు ఆయా జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం వివరాలను ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్చేపట్టి విజేతలను ప్రకటిస్తారు.
ALSO READ : తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు..
- సంగారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 23.46 శాతం పోలింగ్ నమోదు
- మెదక్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.52 శాతం పోలింగ్ నమోదు
- సిద్దిపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 24.03 శాతం పోలింగ్ నమోదు
- కుమ్రంబీమ్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 19.10 పోలింగ్ శాతం నమోదు
- జగిత్యాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 16.67 పోలింగ్ నమోదు
- కరీంనగర్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 15.87శాతం పోలింగ్
- నారాయణపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.13 పోలింగ్ శాతం నమోదు
- వనపర్తి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.5 పోలింగ్ శాతం నమోదు
- ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ 11 శాతం నమోదు
- నిర్మల్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 20.39 శాతం నమోదు

