అయోధ్య నిర్మాణం కోసం పెండ్లి చేసుకోనని ప్రతిజ్ఞ

 అయోధ్య నిర్మాణం కోసం పెండ్లి చేసుకోనని ప్రతిజ్ఞ

భోజ్​పాలి బాబా అసలు పేరు రవీంద్ర గుప్తా. డిసెంబర్ 6, 1992లో తన స్నేహితుల​తో కలిసి కరసేవలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లాడు. అక్కడ రామమందిరం నిర్మించే వరకు తను పెండ్లి చేసుకోనని ప్రతిజ్ఙ చేశాడు. అప్పటికి అతని వయసు 22 ఏండ్లు. 31 ఏండ్ల కిందట శపథం చేసిన రవీంద్ర గుప్తా.. భోజ్​పాలి బాబాగా మారి రాముడి సేవలో ఉన్నాడు. రామ మందిరం నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న టైంలో నర్మదా పరిక్రమ పట్ల ఆసక్తి వచ్చిందట. 

అప్పుడు ఆరెస్సెస్​ నుంచి బయటకు వచ్చి పరిక్రమ మొదలుపెట్టాడు. ఇప్పటికి నర్మదా నదికి ఐదు సార్లు ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత నుంచి బేతుల్ దగ్గర్లోని మిలాన్​పూర్ గ్రామంలో ఉంటున్నాడు. విశ్వ హిందూ పరిషత్, సంఘ్​లో పనిచేసిన టైంలో కొందరు పరిచయస్తులు బసకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బేతుల్ చిరునామాకి అయోధ్య నుంచి భోజ్​పాలి బాబాకి ఆహ్వానం అందింది. 

కరసేవలో పాల్గొనడానికి మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. దాంతో బట్టలు, డబ్బులు లేకుండా ఖాళీ చేతులతో రైల్వే స్టేషన్​కు వెళ్లా. విషయం తెలిసి మా ఫ్యామిలీ అక్కడికి వచ్చి నన్ను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ, నన్ను ఆపలేక చివరకి మా అన్నయ్య కూడా కొంత డబ్బు ఇచ్చాడు” అని ఆ నాటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. అయోధ్యకు వెళ్లిన రవీంద్ర, రామమందిరం కట్టేవరకు పెండ్లి చేసుకోనని ప్రతిజ్ఙ చేశాడు. 

కరసేవ సమయంలో అయోధ్య నుంచి ఇటుకలు కూడా తెచ్చాడు. అయితే, రవీంద్ర నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ఆలయ నిర్మాణం మూడు, నాలుగేండ్లలో పూర్తవుతుంది అనుకున్నాడు. దాదాపు12 ఏండ్లు భోపాల్​లో గడిపాడు. రామ మందిర ఉద్యమం మొదలైనప్పుడు భోపాల్​లోని లఖేరాపుర రామజానకీ దేవాలయంలో ఉన్నాడు. ప్రస్తుతం తన నర్మదా నది చుట్టూ చేసిన జర్నీ మీద ఒక పుస్తకం కూడా రాస్తున్నాడు. తన జీవితం నర్మదా నది కోసమే అనే ఈయన మాతృదేశంలో భరతమాత సేవలో గడపాలి అంటాడు.