ఎన్నికలు ఉన్నా..కొనుగోలు కేంద్రాలు కంటిన్యూ : వీపీ గౌతమ్

ఎన్నికలు ఉన్నా..కొనుగోలు కేంద్రాలు కంటిన్యూ :  వీపీ గౌతమ్

తల్లాడ, వెలుగు :  ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నా  రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. సోమవారం తల్లాడలోని సొసైటీ ఆవరణలో, కల్లూరి ఏఎంసీ గోడౌన్ ఆవరణలో,  పుల్లయ్య బంజర సమీపంలోని శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 230 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా దాదాపు 3,4 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2,203, కామన్ గ్రేడ్ రకానికి క్వింటాల్​కు రూ.2,183 చెల్లించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్​ ఉన్నా రైతులకు ఇన్ టైం లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు.