ప్రతి ఎకరాకూ సాగు నీరు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

ప్రతి ఎకరాకూ సాగు నీరు  : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు : రైతు సంక్షేమమే లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి ఎకరాకూ సాగు నీరు అందిస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే  ఆదినారాయణ అన్నారు. బుధవారం మండలంలోని బెండాళపాడు  వద్ద సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ నుండి ఉపకాల్వ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బెండాలపాడు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

సీతారామ ప్రాజెక్టు ద్వారా అశ్వారావుపేట నియోజకవర్గం మొత్తం సాగునీటి సమస్య ఉండదన్నారు . నియోజకవర్గ వ్యాప్తంగా 1లక్షా 11వేల 480 ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. మండల వ్యాప్తంగా 2,964 ఎకరాలకు ఉపకాల్వల ద్వారా నీరు అందిస్తున్నామని, 10 చెరువులను కూడా నింపి 1,172 ఎకరాల  ఆయకట్టు కు నీరు అందిస్తున్నామని వివరించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరు కలిసి గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్​ లను సన్మానించారు.

సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ భవనాలు కేంద్ర బిందువులు

అశ్వారావుపేట : గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ భవనాలు కేంద్ర బిందువులుగా మారాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. మండలంలోని ఆసుపాకలో నూతనంగా నిర్మించిన  గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపక సర్పంచ్ సోడెం ఆదిలక్ష్మి, నాయకులు జూపల్లి రమేశ్, తుమ్మా రాంబాబు, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముష్టిన శిరీష త
దితరులు పాల్గొన్నారు.

మెరుగైన సౌకర్యాలు కల్పనకు  కృషి 

దమ్మపేట : ప్రతి గ్రామంలో మెరుగైన సౌకర్యాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మండలంలోని కొమ్ముగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, కొమ్ముగూడెం సర్పంచ్ సోయం సత్యవతి పాల్గొన్నారు.