ఖమ్మం సిటీలో కాకా వెంకటస్వామి మెమోరియల్ ..టీ20 క్రికెట్ మ్యాచ్ షురూ

ఖమ్మం సిటీలో కాకా వెంకటస్వామి మెమోరియల్ ..టీ20 క్రికెట్ మ్యాచ్ షురూ

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం సిటీలోని వైఎస్సార్ నగర్ సమీపంలోని గ్రౌండ్ లో విశాక ఇండస్ట్రీస్​ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ టీ20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. బుధ, గురువారాల్లో జరిగే ఈటోర్నమెంట్ లో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం ఉమ్మడి జిల్లాల జట్లకు ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ పర్యవేక్షణలో మ్యాచ్ లు జరిగాయి. 

ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరి చేకూరి వెంకట్, జిల్లా కో ఆర్డినేటర్ ఎండీ మసూద్ పాషా, ఇన్​చార్జ్ ఫారూఖ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైన ప్లేయర్లకు రూ.2 వేల నగదు పురస్కార అవార్డును అందజేశారు. గురువారం ఫైనల్ మ్యాచ్ జరగనుందని వెంకట్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో  టాలెంట్ చూపిన 13 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయిలో జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ కు పంపనున్నట్లు పేర్కొన్నారు. 

మ్యాచ్ లు ఇలా.. 

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు బుధవారం రెండు సెషన్లలో మ్యాచ్ లు నిర్వహించారు. మార్నింగ్ నిర్వహించిన ఇరు జిల్లాల జట్లకు టాస్ వేయగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 15 ఓవర్లలో 107 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భద్రాద్రికొత్తగూడెం జిల్లా 83 రన్స్ కు అలౌట్ అయ్యింది. ఖమ్మం జిల్లా జట్టు 24 రన్స్ తేడాతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాపై విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ గా షేక్ అజర్ నిలిచాడు. మధ్యాహ్నం తిరిగి ఇరు జట్లకు రెండవ మ్యాచ్ నిర్వహించగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జిల్లా జట్టు 17 ఓవర్లలో 117 రన్స్ చేశారు. తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా వంశీ నిలిచాడు.