పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ జితేశ్

పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ జితేశ్
  •   పాల్వంచ చుట్టూ ఉన్న అందాలను తిలకించిన కలెక్టర్ ​జితేశ్​ 

పాల్వంచ,వెలుగు: తెలంగాణలో నే  అత్యంత ప్రాచుర్యం పాల్వంచ చుట్టూ ఎన్నో అందాలు ఉన్నాయని వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దతామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ ​వి పాటిల్ అన్నారు. బుధవారం హిల్ వ్యూ ట్రెక్కింగ్ లో భాగంగా పాల్వంచ లోని శ్రీనివాస కాలనీ శ్రీనివాసగిరి గుట్టపైన ఆయన హి ల్ వ్యూ తిలకించారు. శ్రీనివాస కాలనీ వెంకటేశ్వర స్వామి పాదాల మండపం నుంచి 1,600 మెట్లు ఎక్కి  స్వామిని దర్శించుకున్నారు.  ఆలయ ప్రధాన అర్చ కులు తోలేటి నగేశ్​కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

ఆలయ కోలాట బృందం మహిళలు ప్రధాన ద్వారం నుంచి మెట్ల మార్గం వరకు కోలాటం వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాను పర్యాటకంగా  అభివృ ద్ధి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. శ్రీనివాసగిరి పైకి అటవీశాఖ నిబంధనలకు అనుగుణంగా పైకి వెళ్లే మార్గాన్ని అన్వేషిస్తామని చెప్పారు. పాదాల మండపం వద్ద మొక్కలు నాటారు. 20 వేల మొక్కలు నాటిన మొక్కల వెంకన్నను అభినందించారు. జిల్లా క్రీడల అధికారి పరంధామ రెడ్డి, మహీధర్, తహసీల్దార్ దారా ప్రసాద్, ఇరిగేషన్ డీఈ రాణి, టీఎన్జీవో  నాయకుడు చైతన్య భార్గవ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మహీధర్, కోచ్ నాగేంద్ర, ఆర్చరీ కోచ్ కళ్యాణ్, షూటింగ్ కోచ్ నబి టైక్వాండో కోచ్ రమేశ్, ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, పీడీ శ్వేత, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

‘మీ డబ్బు..  మీ హక్కు’..

భద్రాద్రికొత్తగూడెం : ‘మీ డబ్బు–మీ హక్కు’ ప్రోగ్రామ్​ను బ్యాంకు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ జితేశ్​ సూచించారు. కలెక్టరేట్​లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్​క్లైమ్డ్​ ఖాతాల్లో దాదాపు రూ.46కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. ఈ డబ్బులను తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ‘మీ డబ్బు–మీ హక్కు ప్రోగ్రామ్​’ను ప్రవేశపెట్టిందన్నారు. 

ఈ మొత్తాలు ప్రజలకు చేరేంత వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అన్ని అన్​ క్లయిమ్స్​ డిపాజిట్లను ఈ నెల 31 లోపు క్లియర్​ చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ప్రక్రియ చేయకపోతే సంబంధిత శాఖాధికారులకు షోకాజ్​ నోటీసులు ఇవ్వనున్నట్టు హెచ్చరించారు.