కామారెడ్డిలో వీఆర్ఏ ఆత్మహత్య..ఉద్రిక్తత

కామారెడ్డిలో వీఆర్ఏ ఆత్మహత్య..ఉద్రిక్తత

వీఆర్ఏ అశోక్ ఆత్మహత్యతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఏరియా హాస్సిటల్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. సర్కార్ సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని హాస్పిటల్ దగ్గర వీఆర్ఏలు ఆందోళనకు దిగారు . డెడ్ బాడీని పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీఆర్ఏల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు  మద్దతు తెలిపారు. ఈక్రమంలోనే పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా డెడ్ బాడీని హాస్సిటల్ లోపలికి తీసుకెళ్లడంతో డాక్టర్లు పోస్టుమార్టం చేస్తున్నారు . 

నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్.. సమస్యల తీర్చాలంటూ వీఆర్ఎఏలు చేస్తున్న ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అశోక్ ఆత్మహత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ వీఆర్ఏలు ఆరోపిస్తున్నారు.