మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏ జేఏసీ యత్నం, అరెస్ట్

మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి వీఆర్ఏ జేఏసీ యత్నం, అరెస్ట్

హైదరాబాద్​, వెలుగు: వీఆర్ఏలకు పే స్కేల్ అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ.. బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్​ను వీఆర్ఏ జేఎసీ నేతలు సోమవారం ముట్టడికి యత్నించారు. దీంతో వారి ని పోలీసులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పీఎస్​కు తరలించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్​కే దాదేమియా మాట్లాడారు. పే స్కేల్ అమలు చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. తమ హక్కులు నెరవేరతాయో.. లేదో.. అనే ఆవేదనతో 26 మంది గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయారన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముగ్గురు సూసైడ్​ చేసుకున్నారన్నారు. హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే.. మంగళవారం అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వీఆర్ఏలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు.  నిరసన కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ కో కన్వీనర్​ వెంకటేశ్​ యాదవ్, వికారాబాద్ జిల్లా చైర్మన్ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా చైర్మన్ వెంకటేశ్​ ముది రాజ్, ప్రధాన కార్యదర్శి నరసింహ, వివిధ జిల్లాల వీఆర్ఏ జేఏసీ నేతలు గోపాల్ ఉమామహేశ్వర్, బాల్​రాజ్, రత్నం లక్ష్మయ్య, భాస్కర్​ పాల్గొన్నారు. 

కటాఫ్​ మార్కులపై ఎంఆర్​పీఎస్​ నిరసన

ఎస్సై, కానిస్టేబుల్​ నోటిఫికేషన్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్​ మార్కులు తగ్గించాలని డిమాండ్​ చేస్తూ.. ఎంఆర్​పీఎస్, ఎంఎస్ఎఫ్​ ఆధ్వర్యంలో అభ్యర్థులు బంజారాహిల్స్​లోని మినిస్టర్స్​ క్వార్టర్స్​ను ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్​ పీఎస్​కు తరలించారు.

పంచాయతీ కార్యదర్శుల అసెంబ్లీ ముట్టడి యత్నం

జీవో 317ను సవరించి, నష్టపోయిన పంచాయ తీ సెక్రటరీలను వారివారి జిల్లా, జోన్​లలో తిరిగి సర్దుబాటు చేయాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కార్యదర్శులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని 170 మంది సెక్రటరీలను అరెస్ట్ చేసి.. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొత్త పోస్టుల కోసమే 317 జీవో అని చెప్పిన ప్రభుత్వం.. ఆ జీవోను తమకు ఎందుకు వర్తింప జేసిందని ప్రశ్నించారు. దీంతో వెయ్యి మంది పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. ఈ సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదని, అందుకే అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించామని మధుసూదన్​ రెడ్డి చెప్పారు.