కరీంనగర్ లో విధులు బహిష్కరించిన వీఆర్ఏలు

కరీంనగర్ లో విధులు బహిష్కరించిన వీఆర్ఏలు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ  కరీంనగర్ జిల్లాలో వీఆర్ఏలు విధులు బహిష్కరించారు. కొత్త రెవెన్యు చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ మేరకు కరీంనగర్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు వినతి పత్రం అందజేశారు. పే స్కేల్ అమలు, చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని, అర్హులైన వీఆర్ఎ లకు ప్రమోషన్స్ కల్పిస్తామని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.