భూముల పట్టాల్లో అవకతవకలు : VRO, VRAలను బంధించారు

భూముల పట్టాల్లో అవకతవకలు : VRO, VRAలను బంధించారు

భూములు పట్టా చేయని రెవిన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంట రైతులు. వీఆర్ఓలు, వీఆర్ఏలను గ్రామపంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు. వల్లెంకుంట గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ భూముల పట్టా కోసం కొన్నాళ్లుగా తాడిచెర్ల తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పని కావటంలేదు. దీంతో రైతులంతా కలిసి తహసీల్దార్ ను నిలదీయటంలో ఇవాళ గ్రామానికి వచ్చి.. భూసమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. తీరా ఇవాళ కూడా తహసీల్దార్ రాకుండా.. వల్లెంకుంట, మల్లారం, రుద్రారం వీఆర్ఓలను పంపించాడు. ఏడాదిగా తిప్పించుకుంటూ భూములు పట్టా చేయటంలేదని ఆగ్రహించిన గ్రామస్తులు..  ముగ్గురు వీఆర్ఓలను, ముగ్గురు మహిళా వీఆర్ఏలను పంచాయతీ ఆఫీసులో నిర్భందించి తాళం వేశారు.

తహసీల్దార్ ఆఫీసులో లంచాలు ఇస్తేనే పని జరుగుతోందని ఆరోపించారు రైతులు. రెవిన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచి, గ్రామస్తులు రైతులతో మాట్లాడారు. 15 రోజుల్లో అన్ని భూములకు పట్టాలు చేయిస్తామని వీఆర్ఓలు హామీ ఇవ్వటంతో శాంతించిన రైతులు.. తాళం తీశారు.