Vyooham,Sapatham: థియేటర్లో కాదు డైరెక్ట్ OTTకి వ్యూహం, శపథం.. వర్మ కీలక ప్రకటన

Vyooham,Sapatham: థియేటర్లో కాదు డైరెక్ట్ OTTకి వ్యూహం, శపథం.. వర్మ కీలక ప్రకటన

సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal varma) తెరకెక్కిన లేటెస్ట్ సినిమాలు వ్యూహం(Vyooham), శపధం(Sapatham). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అందులో మొదటి భాగమైన వ్యూహం ఎన్నో వాయిదాల నడుమ ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రెండో పార్ట్ శపథం సినిమా ఈ శుక్రవారం(మార్చ్ 8) రిలీజ్ కానుంది. ఈ క్రమంలో కీలక ప్రకటన చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

అదేంటంటే..  వర్మ ప్లాన్ ప్రకారం వ్యూహం, శపథం చేయడానికి అసలు కారణం సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా తియ్యటం. కొన్ని కారణాల వల్ల సెన్సార్ బోర్డు అనుమతించిన వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ చేశారట. కానీ, ఇప్పుడు తాము ఎం చెప్పాలనుకున్నామో ఆ పూర్తి కథను శపథం ఆరంభం చాప్టర్ 1ను ఈ రోజు(మార్చ్ 7) సాయంత్రం 8 PM కి, అలాగే శపథం అంతం చాప్టర్ 2ను రేపు(మార్చి 8) 8 pm  కి విడుదల చేయనున్నారట. అది కూడా ఆంధ్రప్రదేశ్ లొని AP ఫైబర్ నెట్ లో ఓటీటీ యాప్ ద్వారా పే పర్ వ్యూ లొ చూడటానికి అవకాశం కలిపిస్తున్నారు. అనంతరం అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయనున్నారు.

ALSO READ :- Ajith Kumar: హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో..ఆందోళనలో ఫ్యాన్స్..!

 ఇక శపథం ఆరంభం చాప్టర్ 1, శపథం అంతం చాప్టర్ 2 తీసిన ఉద్దేశ్యం పచ్చి నిజాలను ప్రేక్షకులకు చూపించడానికే అని ఈ సందర్బంగా ప్రకటించారు వర్మ. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లపై వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.