చెలరేగిన ఆస్ట్రేలియా..భారత్ కు బిగ్ టార్గెట్

చెలరేగిన ఆస్ట్రేలియా..భారత్ కు బిగ్ టార్గెట్

సిడ్నీ: 3టీ20ల సిరీస్ లో భాగంగా సిడ్రీ వేదికగా ఆదివారం భారత్ తో జరుగుతున్న సెకండ్ టీ20లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 రన్స్ చేసింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడారు ఆసిస్ ప్లేయర్లు . తొలి టీ20 విజయంలో ప్రధాన పాత్ర పోషించిన స్పిన్నర్‌ చాహల్‌ ఈ మ్యాచ్‌ లో దారుణంగా విఫలమయ్యాడు.

4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే తీసి 51 పరుగులు సమర్పించుకున్నాడు. పేసర్‌ దీపక్‌ చాహర్‌(4/48) కూడా కట్టడి చేయలేకపోయాడు.  వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో అనూహ్యంగా వేడ్‌ రనౌట్‌ కావడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. అయినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ తమదైన శైలిలో చెలరేగడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది.

భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.