యూనివర్సిటీ, ఉన్నత విద్యాసంస్థల సిబ్బంది వేతనాలు పెంపు

యూనివర్సిటీ, ఉన్నత విద్యాసంస్థల సిబ్బంది వేతనాలు పెంపు

విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల సిబ్బంది వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.

2778 మంది బోధనా సిబ్బందికి లబ్ధి కలగనుంది. 2019 ఏప్రిల్ నుంచి వేతనాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016 జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. 2019 మార్చ్ 31 వరకు రూ.260 కోట్ల బకాయిలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించనున్నాయి. వేతనాల పెంపుతో ప్రతి ఏటా సర్కార్ పై రూ.264 కోట్ల అదనపు భారం పడుతుంది.