అగ్రివర్సిటీ యూజీ కోర్సులకు వాక్- ఇన్ కౌన్సెలింగ్

అగ్రివర్సిటీ యూజీ కోర్సులకు  వాక్- ఇన్ కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్​ కోటాలో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 8న వాక్- ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీ విద్యాసాగర్ తెలిపారు. 

రాజేంద్రనగర్‌‌లోని అగ్రికల్చర్​ వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగంలో ఈ కౌన్సెలింగ్ ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తి గల విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రవేశ రుసుములతో కౌన్సెలింగ్ కు హాజరు కావాలని రిజిస్ట్రార్ సూచించారు. పూర్తి వివరాలను అగ్రికల్చర్​ యూనివర్సిటీ అధికారిక వెబ్‌‌సైట్ www.pjtsau.edu.in లో పొందవచ్చని డాక్టర్ విద్యాసాగర్ పేర్కొన్నారు.