జగిత్యాలలో వాల్ పోస్టర్ల వార్...అవినీతి పై కాంగ్రెస్, బీజేపీ పరస్పర సవాల్

జగిత్యాలలో వాల్ పోస్టర్ల వార్...అవినీతి పై కాంగ్రెస్,  బీజేపీ పరస్పర సవాల్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల రాజకీయాల్లో వాల్ పోస్టర్ల యుద్ధం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకులు వేసిన పోస్టర్లకు కౌంటర్‌‌గా బీజేపీ నాయకులు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌కే పోస్టర్లు అంటించారు.  భోగ శ్రావణి మున్సిపల్ చైర్‌‌ పర్సన్‌‌గా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై ఈ నెల 29న తహసీల్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్ నాయకుడు ముఖేశ్​కన్నా పేరుతో పట్టణంలో వాల్ పోస్టర్లు వెలిశాయి. 

దీనికి ప్రతిగా  బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయానికి పోస్టర్లు అంటించారు.  బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్, ఇప్పుడు అధికారం కోసం కాంగ్రెస్‌‌లోకి మారారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో జగిత్యాలలో జరిగింది అభివృద్ధా?  లేక అవినీతా  అనే అంశంపై ఈ నెల 30న చర్చకు రావాలని వారు ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.