సంధ్య థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి

సంధ్య థియేటర్లో మెగా ఫ్యామిలీ సందడి

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా ఇవాళ గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఇందులో చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా, మాస్ మాహారాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. రిలీజ్ సందర్భంగా మెగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.  ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి పలువురు సినీ సెలబ్రెటీస్ మూవీని చూశారు. 

డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, చిరంజీవి కూతుర్లు, మనవరాళ్లు, డైరెక్టర్ మెహర్ రమేష్ వాల్తేర్ వీరయ్య మొదటి షోను చూశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే సంధ్య థియేటర్ కు చేరుకున్న వీరందరూ.. అభిమానుల మధ్య మూవీని చూసి ఎంజాయ్ చేశారు. దీనికి తోడు థియేటర్ వద్ద మెగా అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బాణాసంచా పేలుస్తూ.. తమ అభిమాన హీరో చిరంజీవి మూవీని ఎంజాయ్ చేస్తూ... ఆనందం వ్యక్తం చేస్తున్నారు.