- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను త్వరగా సేకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, ఫారం 6, 7, 8లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. డి-సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, వనపర్తి తహసీల్దార్ రమేశ్‌రెడ్డి ఉన్నారు.
