- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని బాల కిష్టాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో బిల్లులు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ఉచిత డయాలిసిస్ కేంద్రాన్ని కూడా సందర్శించారు. అందుతున్న సేవలపై పేషెంట్లను ఆరా తీశారు. కేంద్రంలో రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై పలు సూచనలు చేశారు.
